నారా రోహిత్ స్పీడు పెంచాడు.!
- April 18, 2024కంటెంట్ బేస్ హీరోగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవలే ‘ప్రతినిధి 2’తో మళ్లీ నారా రోహిత్ పేరు తెర పైకి వచ్చింది.
న్యూస్ రిపోర్టర్ మూర్తి డైరెక్టర్‌గా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రతినిధి 2’. నారా రోహిత్ కెరీర్ మొదట్లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న సినిమానే ‘ప్రతినిధి 2’.
ఈ సినిమాతో మళ్లీ సంచనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు నారా రోహిత్. ఇదిలా వుంటే, నారా రోహిత్ మరో నాలుగు ప్రాజెక్టులు సిద్ధం చేసి వుంచాడట.
సైలెంట్‌గా ఆయా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాడట. తాజాగా అందులో ఒకటి ‘సుందరకాండ’ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.
‘ఇది నా కథ.. ప్రేమకథ.’ అంటూ పలు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలను ప్రస్థావిస్తూ డిజైన్ చేసిన ఈ సినిమా టీజర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనేలా వుంది ఈ టీజర్.
అప్పుడెప్పుడో వచ్చిన విక్టరీ వెంకటేష్ ‘సుందరకాండ’ సినిమా ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అదో అద్భుతమైన కావ్యం. ఇప్పుడు మళ్లీ నారా రోహిత్ చేయబోయే ఈ ‘సుందరకాండ’ కూడా ఈ జనరేషన్‌కి అద్భుతం అవుతుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు