హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- April 19, 2024
హైదరాబాద్: హైదరాబాద్లోని ఫిలింనగర్లో విషాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతూ బీఎండబ్ల్యూ కారుని ఢీకొట్టాడు ఓ మైనర్(14). దీంతో కారు రిపైర్ చేయించడానికి రూ.20 వేలు ఇవ్వాలని ఇద్దరు డ్రైవర్లు డిమాండ్ చేశారు.
ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మైనర్ డ్రైవింగ్ కేసు పెడతామని బెదిరించారు. దీంతో ఆ బాలుడి కుటుంబంపై తీవ్ర ఒత్తిడి పడింది. డబ్బు లేదని, కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని ఆ బాలుడి తల్లి సూర్య కుమారి (35) బలవన్మరణానికి పాల్పడింది.
ఆమె భర్త ఫిర్యాదుతో డైవర్లు చంద్ర శేఖర్, మహేశ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారు డామేజ్ అయితే యజమాని ఊరుకోడని, అందుకే డబ్బు ఇవ్వాలని కోరామని ఇద్దరు డ్రైవర్లు కన్నీటి పర్యంతమయ్యారు. తమ మీద కేసు పెడితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని అవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?