ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- April 19, 2024
హైదరాబాద్: రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే రైతులు అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా అంబెద్కర్ స్టేడియం వద్ద పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అందిస్తోందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కుని మాట్లాడుతున్నాయని అన్నారు. బోగస్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని తెలిపారు. తల్లిని రాజకీయాల్లోకి లాగిన వ్యక్తి బండి సంజయ్ అని అన్నారు.
తల్లి పేరుమీద రాజకీయాలు చేసేది ఏవరో అందరికి తెలుసని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరూ స్నేహితులు అని అన్నారు. వినోద్ కుమార్ ను ఓడించడానికి గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. పేద ప్రజల భూములను లాక్కున్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 75 వేల కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చిందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎన్నికల కోడ్ అయిపోగానే అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అక్రమ దందాలకు అవినీతికి, వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలంటూ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?