‘మనమే’ టీజర్ టాక్.! ఇది శర్వా సినిమాయేనా.?
- April 19, 2024శర్వానంద్ అంటే విలక్షణ నటనకు ప్రతిరూపం. అన్ని రకాల ఎమోషన్లు పండించగల నటుడు శర్వానంద్. ‘రన్ రాజా రన్’ సినిమాతో తనలోని హ్యూమరస్ యాంగిల్ సైతం బయటికి తీసి సక్సెస్ అయ్యాడు.
ఈ మధ్య శర్వానంద్ నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శర్వా నటించిన ‘మనమే’ చిత్రం టీజర్ రిలీజ్ కావడంతో, మళ్లీ శర్వానంద్ సినిమాల్లో యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక, ‘మనమే’ విషయానికి వస్తే.. లేటెస్ట్గా టీజర్ రిలీజ్ చేశారు. కృతి శెట్టి ఈ సినిమాలో శర్వానంద్‌కి జోడీగా నటిస్తోంది. ఓ తల్లి, తండ్రి, కొడుకు.. ఇలా ట్రయాంగిల్లో సాగే కథగా టీజర్‌ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ఎటువంటి బాధ్యతా లేని తండ్రిగా, భర్తగా శర్వానంద్ పాత్రను పరిచయం చేశారు. ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటేనే ఉద్యోగం కూడా చేసే భార్యగా, ఓ బిడ్డకి తల్లిగా కృతి శెట్టి పాత్ర కనిపిస్తోంది.
క్యారెక్టర్లయితే ఇంట్రెస్టింగ్‌గానే వున్నాయ్. కానీ, టీజర్ ఏమంత ఎఫెక్టివ్‌గా అనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. అసలు శర్వానంద్ సినిమానే కాదిది అనే రెస్పాన్స్ కూడా వస్తోంది. అలాగే, శర్వానంద్ డైలాగులు కానీ, ఆటిట్యూడ్ కానీ ఏవీ ఫ్రేక్షకుల్ని మెప్పించడం లేదు టీజర్లో. చూడాలి మరి, లాంగ్ గ్యాప్ తర్వాత వ స్తున్న ‘మనమే’ శర్వాకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.!
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం