అవకాశాలు బాగానే వస్తున్నా.. అదృష్ట ‘నిధి’ దక్కడం లేదే.!
- April 19, 2024నిధి అగర్వాల్.. బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో రెండు సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ. పాపం.! అన్నీ వున్నా అదేదో అన్నట్లు.. అందం, అభినయం, డాన్సింగ్ టాలెంట్.. ఇలా అన్ని కళలున్నప్పటికీ అసలు కళ అదృష్టమే వరించడం లేదీ ముద్దుగుమ్మకి.
‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో ఓ సూపర్ హిట్ కూడా ఖాతాలో వేసుకుంది. అయినా నిలబడలేదు. పవన్ కళ్యాణ్ రూపంలో (హరి హర వీరమల్లు) ఓ బిగ్గెస్ట్ ఆఫర్ కూడా చేజిక్కించుకుంది. అయినా లాభం లేకుండా పోయింది.
ఆ సినిమా అడ్రస్సే గల్లంతైపోయింది. ఇక, ఇప్పుడు ప్రబాస్ సినిమాలో ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదైనా అమ్మడికి యూజ్ అవుతుందా.? లేదా.? అసలింతకీ ఈ ప్రచారంలో నిజముందా.? అనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాలి.
ప్రబాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ సినిమాలో నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆల్రెడీ మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. మరో ఇద్దరు ముద్దుగుమ్మలకు ఛాన్సుండగా.. అందులో నిధి అగర్వాల్ పేరు తాజాగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు