ప్రియదర్శి - నభా నటేష్.! డార్లింగ్ కొత్తగా సరికొత్తగా.!
- April 19, 2024కమెడియన్ ప్రియదర్శి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మల్లేశం’ తదితర సినిమాలు సోలో హీరోగా చేసి సక్సెస్ అయ్యాడు ప్రియదర్శి.
హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకి ఫేమ్ తీసుకొచ్చిన కమెడియన్ పాత్రలను మాత్రం వదులుకోవడం లేదీ యంగ్‌స్టర్. అదీ ఓ రకంగా మంచిదే అని చెప్పాలి.
గతంలో చాలా మంది కమెడియన్లు ఇలాగే హీరోలుగా మారి, కామెడీని వదిలిపెట్టేశారు. ఆ తర్వాత అటుకీ, ఇటుకీ కాకుండా కెరీర్లో వెనకబడిపోయారు. కానీ, ప్రియదర్శి మాత్రం అలా చేయకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటున్నాడు.
అలాగే సోలోగానూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. హీరోగా ప్రియదర్శి చేస్తున్న సినిమాకి ‘డార్లింగ్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదో కొత్త రకం ప్రేమకథ అని తెలుస్తోంది. ఇంతవరకూ చాలా లవ్ స్టోరీస్ చూశాం. కానీ, ఈ సినిమాలోని లవ్ స్టోరీ న భూతో న భవిష్యతి అనేలా వుంటుందని అంటున్నారు.
ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీలవుతారని చెబుతున్నారు. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్లు కూడా చాలా చాలా ఇన్నోవేటివ్‌గా ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం