వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!

- April 20, 2024 , by Maagulf
వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!

యూఏఈ: వర్షాలు నేపథ్యంలో నిలిచిపోయిన నీటికి సంబంధించిన వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కోసం వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు యూఏఈలోని వైద్యులు, ఆసుపత్రులు చెబుతున్నాయి. కాగా డెంగ్యూ అనేది  దోమల మరియు ఈగల ద్వారా సంక్రమించే వ్యాధులు. ముంపు ప్రాంతాలలో నివసించే వారు ఇప్పటికే జ్వరం, అతిసారం మరియు విరేచనాలతో బాధపడుతున్న రోగుల పెరుగుదలను చూస్తున్నామన, ఈ కేసులు మరింత పెరుగుతాయని తాము అంచనా వేస్తున్నట్ల.. దీనితో పాటు న్యుమోనియా మరియు వైరల్ బ్రోన్కైటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని జెబెల్ అలీలోని ఆస్టర్ సెడార్స్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ అమల్ అబ్దుల్‌కాడర్ తెలిపారు.

వరదలు మురుగునీరు మరియు గృహ తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణుడు తెలిపారు. ఈ కలుషిత నీరు అతిసారం, విరేచనాలు, గ్యాస్ట్రోఎంటెరిటిస్, అమీబియాసిస్, హెపటైటిస్, టైఫాయిడ్ మరియు క్యాంపిలోబాక్టీరియోసిస్ వంటి వ్యాధులకు అధిక ప్రమాదాన్ని కలిగిస్తుందని తెలిపారు. వ్యక్తులు కలుషితమైన నీటిని తాగడం వల్ల ఈ వ్యాధులు వస్తాయని తుంబే యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఫియాజ్ అహమ్మద్ చెప్పారు.

వరద నీటి లో నానిన వాటిని ఉపయోగించే ముందు అన్ని నానబెట్టిన దుప్పట్లు, తివాచీలు మరియు కర్టెన్‌లను మంచి సూర్యకాంతిలో ఆరబెట్టాలని,  తేమ ఉంటే బాక్టీరియా వృద్ధి చెంది, ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుందని డాక్టర్ అబ్దుల్‌కాడర్ వివరించారు.  అదే విధంగా అన్ని కూరగాయలు మరియు పండ్లను తినడానికి ముందు వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగడం చాలా అవసరమని డాక్టర్ ఫియాజ్ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com