ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల

- April 20, 2024 , by Maagulf
ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్‌ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎల్లుండి ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.
రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల 30 వేల 633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 వేల 473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8వ తేదీతోనే ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను సైతం ఇప్పుటికే పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

వెబ్‌సైట్‌లో ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి: 

టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల చేయగానే ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. అధికారికంగా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన వెంటనే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

దాదాపు 6.3 లక్షల రెగ్యులర్‌ విద్యార్ధులతో పాటు మరో లక్ష వరకు ప్రైవేట్‌లో పరీక్షలు రాసిన వారు ఒకేసారి చెక్‌ చేసుకున్నా సర్వర్‌ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గ్రేడింగ్‌ ప్రక్రియను సైతం పూర్తి చేసి మార్కుల షీట్స్‌ను ప్రిపేర్‌ చేస్తున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల హాల్‌ టికెట్‌ నెంబర్‌ను పొందుపరిచి https://Results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చూసుకోవచ్చు. మార్కుల మెమోను తాత్కాలికంగా ఈ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత పాఠశాలకు వెళ్లి మార్క్స్ మెమోను అధికారికంగా తీసుకోవాలి. మెమోలను పాఠశాలకు పంపడంలో ఆలస్యం కాకుండా ఫలితాల వెల్లడితో పాటు పార్శిల్‌ ప్రక్రియను సైతం చేస్తున్నారు. మార్క్స్ షీట్‌ గ్రేడ్స్‌గా ఉంటుంది. ఎక్కడా ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు పొందారో తెలియదు. కేవలం సబ్జెట్‌ వారీగా గ్రేడింగ్‌ మాత్రమే సర్టిఫికేట్​లో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com