వీసా నిబంధనల సమగ్ర సడలింపునకు శ్రీకారం
- June 07, 2016
భారత వర్తక, వాణిజ్య రంగాలకు వూతం ఇచ్చే దిశగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వీసా నిబంధనల సమగ్ర సడలింపునకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విధి విధానాలు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరాయి. వీసా నిబంధనలను సడలించే అంశంపై హోంశాఖ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి రీటా టియోటియా చర్చించినట్లు సమాచారం. 'వర్తక, వాణిజ్యానికి సంబంధించి ఉన్న వీసా నిబంధనలను సడలించేందుకు రంగం సిద్ధం చేశాం. ఆరోగ్యం రక్షణ, పర్యాటకం, వ్యాపార రంగాలకు సంబంధించి నిర్వహించే సదస్సులు, సమావేశాలకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తుంటారు.
ఆయా రంగాల్లో నిబంధనలు సడలించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖకు సమాచారం ఇచ్చాం' అని వాణిజ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
నిబంధనల సడలింపు ఆమోదం పొందితే భారత వాణిజ్య రంగానికి మరింత వూతం ఇచ్చినట్లవుతుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. నిబంధనలు కఠినంగా ఉండటంతో ఒక ఏడాదిలో భారత్ సుమారు 80 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను కోల్పోతోందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే మరిన్ని పెట్టుబడులు దేశానికి వస్తాయని పేర్కొన్నారు. థాయిలాండ్ లాంటి దేశాలతో పోలిస్తే పర్యాటకంగా విదేశీయులను ఆకర్షించడంలో భారత వెనుకబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేక్ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా సాకారం కావాలంటే నిబంధనలు సరళతరం కావాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







