'కబాలి' ఆడియోను నేరుగా మార్కెట్లోకి..
- June 07, 2016
స్టైల్ అంటే రజనీకాంత్.. రజనీకాంత్ అంటే స్టైల్. 'కబాలి రా..' అంటూ టీజర్‌తోనే రికార్డుల మోత మోగించేశారు సూపర్‌స్టార్. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు ఓ చేదు వార్త. పా రంజిత్ దర్శకత్వం వహించిన 'కబాలి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. తొలుత అనుకున్న దాని ప్రకారం జూన్ 12న 'కబాలి' ఆడియో వేడుక జరగాల్సి ఉంది. అయితే రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వేడుక ఖరారు చేసిన తేదీ నాటికి ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు.
దీంతో నేరుగా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర బృందం పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు డీలా పడిపోయారు. తమ అభిమాన కథానాయకుడిని ఆడియో వేడుక సందర్భంగానైనా చూడవచ్చని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో రజనీ సరసన రాధిక ఆప్టే నటించారు. జులై 1న 'కబాలి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







