యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు

- April 23, 2024 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు

అబుదాబి: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం అబుదాబిలోని కసర్ అల్ వతన్ (నేషన్ ప్యాలెస్)లో అధికారిక చర్చలు నిర్వహించారు. ఎమిరెట్స్ మరియు ఒమన్ సుల్తానేట్ మధ్య సంబంధాలు చరిత్రలో నిలిచి పోయినట్లు సుల్తాన్ తెలిపారు. రెండు దేశాలు బలమైన కుటుంబ బంధాలు, సహకారం మరియు ఏకీకరణతో కూడిన ప్రత్యేక సామాజిక మరియు సాంస్కృతిక అనుబంధాన్ని కలిగి ఉన్నాయన్నారు. ఈ బంధం రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే స్థిరమైన మరియు ఆదర్శప్రాయమైన సంబంధాలకు పునాదులుగా నిలుస్తుందని,  పురోగతి మరియు శ్రేయస్సు కోసం వారి ప్రజల ఆకాంక్షలను సాధించగలదని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక అవకాశాలను అన్వేషించడానికి, రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం వాటిని అభివృద్ధి చేయడానికి ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. సెషన్‌లో ఇరువురు నాయకులు రెండు ప్రజల ప్రయోజనాలకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలలో ఇప్పటికే ఉన్న సహకారం, వాటిని ప్రోత్సహించే మార్గాల గురించి చర్చించారు. చర్చల సెషన్ తర్వాత హిస్ మెజెస్టి ది సుల్తాన్ ఖాసర్ అల్ వతన్ (ప్యాలెస్ ఆఫ్ ది నేషన్) వద్ద సీనియర్ విజిటర్స్ బుక్‌పై సంతకం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com