అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం
- June 07, 2016
అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చాక వర్సిటీలో చేరిన 25 మంది విద్యార్థులను వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పింది. యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ మొదటి సెమిస్టర్ చదువుతున్న 25 మంది భారతీయ విద్యార్థులను అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తిరిగి భారత్ వెళ్లండి.. లేదా మరో యూనివర్శిటీ చూసుకోండి అని చెప్పిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.యూనివర్శిటీ అడ్మిషన్ ప్రమాణాలను ఈ విద్యార్థులు చేరుకోవడం లేదని వర్శిటీ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో సుమారు 60 మంది భారతీయ విద్యార్థులు ఈ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో చేరారు. వారిలో చాలా మంది యూనివర్శిటీ ప్రవేశానికి తగిన అర్హతలను చేరుకోవడం లేదని.. అయితే 35 మందికి మాత్రం కొనసాగడానికి అవకాశమిస్తామని అన్నారు. కానీ 25 మంది విద్యార్థులు మాత్రం కచ్చితంగా యూనివర్శిటీ నుంచి వెళ్లిపోవాలని వర్శిటీ అధికారులు వెల్లడించినట్లు పత్రిక పేర్కొంది. ఈ విద్యార్థులకు తమ కరిక్యులమ్‌లో తప్పనిసరి అయిన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసే నైపుణ్యం లేదని, అందుకే పంపిస్తున్నట్లు వర్శిటీ అధికారి జేమ్స్ గారీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్య వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







