మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- April 25, 2024
దోహా: మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ (MoM) మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ను ప్రారంభించింది. ఇందులో జాగింగ్ ట్రాక్‌లు, ప్లేగ్రౌండ్లు, ల్యాండ్‌స్కేప్ మరియు స్థానిక చెట్లతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలతో 38,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పబ్లిక్ పార్క్ విస్తరించి ఉంది. పురపాలక శాఖ మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ అత్తియా పార్కును ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రజలను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ పార్క్స్ డిపార్ట్మెంట్ నిర్మించిన అతి ముఖ్యమైన పార్కులలో ఇది ఒకటని తెలిపారు. “మంత్రిత్వ శాఖ తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా కొత్త పార్కులను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయి. పబ్లిక్ పార్కులు, ప్లాజా మరియు కార్నిచ్ల సంఖ్య దాదాపు 144కి చేరుకుంది.” అని మంత్రి తెలిపారు.
దాదాపు 38,029sqm విస్తీర్ణంలో ఉన్న పబ్లిక్ పార్క్‌లో 676 మీటర్ల పొడవు గల రబ్బర్ ఫ్లోర్‌తో కూడిన వాక్‌వే ఉంది. 11,316 sqm పచ్చటి ప్రాంతాలు సహజమైన గడ్డి, చెట్లు మరియు తాటి చెట్లతో ఉంటాయి. పార్క్‌లో మూడు ఫుట్‌బాల్ మైదానాలు కూడా ఉన్నాయి. 553 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక బాస్కెట్‌బాల్ కోర్ట్, 667 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక టెన్నిస్ కోర్ట్ మరియు మొత్తం 350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు ఇల్యూమినేటెడ్ పెర్గోలాలు ఉన్నాయి. 132 కార్లు పట్టే పార్కింగ్ స్థలం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు