మోసపోయిన సినీ నటుడు
- June 07, 2016
సీఐడీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్‌ఐ అవతారం ఎత్తాడు . ఓ ఛానెల్‌లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు . ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు . అంతా కలిసి ఓ సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు . అంతేకాకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు . వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణానగర్‌లో నివసించే సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు (48) నివాసంలోకి గత నెల 31 వ తేదీన ఉదయం 10.30 గంటలకు అయిదుగురు యువకులు , ఇద్దరు యువతులు ప్రవేశించారు . తమను తాము పోలీసులమని , న్యూస్ ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్ , ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్‌చేసి బెదిరించారు . ఇంటి బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు . బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు . రూ . 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్ లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు . నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా .. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్‌ఐగా బిల్డప్ ఇచ్చాడు . ఓ టీవీ ఛానెల్ డ్రై వర్‌గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు.ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు.
ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ .25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు .
ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్ , మధు , సంజయ్‌రెడ్డి , లక్ష్మి , దుర్గ , హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు . వీరితో పాటు ఛానెల్ ఎండీని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు .
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







