శ్రీలీలకి ఆ ఛాన్స్ నిజమేనా.?
- April 25, 2024తెలుగులో అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది అందాల భామ శ్రీలీల. అయితే, ఒకే రకం పాత్రలతో బోర్ కొట్టించేస్తోందంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయ్ శ్రీలీల మీద.
దాంతో, ఆమె హవా త్వరలోనే తగ్గిపోనున్నట్లు కనిపిస్తోంది. డాన్సులు చేయడం, అందంగా కనిపించడం ఒక్కటే కాదు, నటిగా గుర్తింపు దక్కించుకోవాలంటే కాస్త ఛాలెంజింగ్ రోల్స్ కూడా ఎంచుకోవడం తెలియాలి.
రొటీన్ రొట్ట కొట్టుడు అంటే ఎంతో కాలం ఆడియన్స్ ఎంటర్టైన్ చేయలేరు. అదే పరిస్థితి ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ జరుగుతోంది.
ఇదిలా వుంటే, శ్రీలీలకు తాజాగా ఓ కోలీవుడ్ ఆఫర్ వచ్చిందనీ తెలుస్తోంది. ‘భగవంత్ కేసరి’ తరహాలో ఆ పాత్ర వుండబోతోందట. తమిళ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రీలీలను ఎంచుకున్నారట. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తెలుగులో ఈ మధ్య శ్రీలీల నుంచి వస్తున్న సినిమాలన్నీ ఫెయిల్యూర్ కావడంతో, సరిగ్గా ఇదే టైమ్‌లో తమిళ నాట ఆఫర్లు దక్కించుకోవడం.. అన్నీ కలిసొచ్చి అక్కడ సక్సెస్ అయితే.. శ్రీలీలకు లక్కు చిక్కినట్లే.!
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం