ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.! స్కేల్ పెద్దదే.!
- April 25, 2024
‘పీవీసీయూ’ అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన సినిమానే ‘హనుమాన్’. సంచలన విజయం అందుకుంది.
ఈ సినిమాతో చిత్ర యూనిట్‌కి వచ్చిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. ఇక, ప్రశాంత్ వర్మ మామూలోడు కాదు. మహా మొండోడు. ఎన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా ‘హనుమాన్’ సినిమా రిలీజ్ విషయంలో అలా ఒంటి కాలిపై నిలబడిపోయాడు.
ఎలాగైనా సరే, సంక్రాంతి బరిలో నిలవాలనుకున్నాడు. నిలిచాడు. విజయం కాదు కాదు, అసలు సిసలు విజయం అందుకున్నాడు. అదే ఉత్సాహంతో ‘హనుమాన్’ సెకండ్ పార్ట్‌కి అంతా సిద్ధం చేసుకుంటున్నాడు.
దాంతో పాటూ, తన సినిమాటిక్ యూనివర్స్‌లో కేవలం చిన్న హీరోల సినిమాలే కాదట.. పెద్ద హీరోలు, స్టార్ హీరోలు సైతం యాక్ట్ చేస్తారని ఆల్రెడీ ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనీ చెప్పాడు.
తానే కాదు, వివిధ స్టార్ డైరెక్టర్లు సైతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వర్క్ చేయనున్నారట. చూస్తుంటే, ప్రశాంత్ వర్మ యూనివర్సిటీ అంత ఆషామాషీగా క్రియేట్ చేసినట్లు లేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?