శ్రీలీలకి ఆ ఛాన్స్ నిజమేనా.?
- April 25, 2024
తెలుగులో అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది అందాల భామ శ్రీలీల. అయితే, ఒకే రకం పాత్రలతో బోర్ కొట్టించేస్తోందంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయ్ శ్రీలీల మీద.
దాంతో, ఆమె హవా త్వరలోనే తగ్గిపోనున్నట్లు కనిపిస్తోంది. డాన్సులు చేయడం, అందంగా కనిపించడం ఒక్కటే కాదు, నటిగా గుర్తింపు దక్కించుకోవాలంటే కాస్త ఛాలెంజింగ్ రోల్స్ కూడా ఎంచుకోవడం తెలియాలి.
రొటీన్ రొట్ట కొట్టుడు అంటే ఎంతో కాలం ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేయలేరు. అదే పరిస్థితి ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ జరుగుతోంది.
ఇదిలా వుంటే, శ్రీలీలకు తాజాగా ఓ కోలీవుడ్ ఆఫర్ వచ్చిందనీ తెలుస్తోంది. ‘భగవంత్ కేసరి’ తరహాలో ఆ పాత్ర వుండబోతోందట. తమిళ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రీలీలను ఎంచుకున్నారట. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తెలుగులో ఈ మధ్య శ్రీలీల నుంచి వస్తున్న సినిమాలన్నీ ఫెయిల్యూర్ కావడంతో, సరిగ్గా ఇదే టైమ్‌లో తమిళ నాట ఆఫర్లు దక్కించుకోవడం.. అన్నీ కలిసొచ్చి అక్కడ సక్సెస్ అయితే.. శ్రీలీలకు లక్కు చిక్కినట్లే.!
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు