దిల్ రాజు బ్యానర్లో డిఫరెంట్ జోనర్.!
- April 26, 2024ఇంతవరకూ దిల్ రాజు బ్యానర్లో ట్రెడిషనల్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీసే రూపొందాయ్. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆహ్లాదంగా అలరించే సినిమాలే అవన్నీ.
అయితే, తాజాగా దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ‘లవ్ మీ’. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమాకి హారర్ టచ్ ఇచ్చారట. టైటిల్లో లవ్ వున్నప్పటికీ, ఇదో హారర్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది.
ఇంతవరకూ దిల్ రాజు టచ్ చేయని జోనర్ ఇది. అయితే, లార్జ్ స్కేల్లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. ప్రముఖ వెటరన్ పీసీ శ్రీరామ్ దీనికి డీవోపీగా చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ‘బేబీ’ సినిమాతో వైష్ణవీ చైతన్య క్రేజ్ ఆకాశాన్నంటేసిన సంగతి తెలిసిందే. అందులోనూ హారర్ ధ్రిల్లర్ బేస్ మూవీస్‌కి ప్రస్తుతం క్యూరియాసిటీ ఎక్కువగా కనిపిస్తోంది.
సో, డిఫరెంట్ జోనర్ అయినా, రాజుగారు ఈ సినిమాతో సక్సెస్ కొడతారనే అనిపిస్తోంది చూడాలి మరి. మేలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు