కీర్తి సురేష్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారుగా.!
- April 26, 2024
‘మహానటి’ సినిమాతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది అందాల భామ కీర్తి సురేష్. ఎలాంటి టఫ్ రోల్ అయినా కీర్తి సురేష్ ముందు మోకరిల్లాల్సిందే.. అనేంతలా ఆ సినిమాతో తన ఇమేజ్‌ని పెంచుకుంది.
ఆ తర్వాత నుంచి కీర్తి సురేష్ చేసిన ప్రాజెక్టులు కూడా ఆ కోవకు చెందినవే కావడం విశేషం. అయితే, ‘సర్కారు వారి పాట’ సినిమా కీర్తి సురేష్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిందనాలా.? లేక కమర్షియల్ హీరోయిన్‌గా తన ఇమేజ్‌ని మరింత రెట్టింపు చేసిందనాలా.? తెలీదు కానీ, మహానటిలో మార్పు బీభత్సంగా వచ్చేసింది.
మార్పు మంచిదే. కానీ, ఇప్పుడు కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు కారణం ఆమె బాలీవుడ్ సినిమా.
బాలీవుడ్‌లో కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన పోస్టర్లు ఈ మధ్య నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లలో కీర్తి సురేష్ ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోసేస్తోంది. ఇంతవరకూ గ్లామర్‌కి దూరంగా వున్న మహానటి.. బాలీవుడ్‌కి వెళ్లాకా గ్లామర్ కంచెలు తెంచేసిందంటూ నెటిజనం విస్తుపోతున్నారు.
‘సర్కారు వారి పాట’ సినిమా నుంచే కీర్తి సురేష్ గ్లామర్ తెరలకు బాగా పని చెప్పింది. ఇక, ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్లాకా.. బొత్తిగా తన సంస్కారం వదిలేసిందంటూ.. ఇంతవరకూ ఆమెను అమితంగా అభిమానించిన వాళ్లే దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?