కీర్తి సురేష్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారుగా.!
- April 26, 2024‘మహానటి’ సినిమాతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది అందాల భామ కీర్తి సురేష్. ఎలాంటి టఫ్ రోల్ అయినా కీర్తి సురేష్ ముందు మోకరిల్లాల్సిందే.. అనేంతలా ఆ సినిమాతో తన ఇమేజ్‌ని పెంచుకుంది.
ఆ తర్వాత నుంచి కీర్తి సురేష్ చేసిన ప్రాజెక్టులు కూడా ఆ కోవకు చెందినవే కావడం విశేషం. అయితే, ‘సర్కారు వారి పాట’ సినిమా కీర్తి సురేష్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిందనాలా.? లేక కమర్షియల్ హీరోయిన్గా తన ఇమేజ్‌ని మరింత రెట్టింపు చేసిందనాలా.? తెలీదు కానీ, మహానటిలో మార్పు బీభత్సంగా వచ్చేసింది.
మార్పు మంచిదే. కానీ, ఇప్పుడు కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు కారణం ఆమె బాలీవుడ్ సినిమా.
బాలీవుడ్లో కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన పోస్టర్లు ఈ మధ్య నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లలో కీర్తి సురేష్ ఓ రేంజ్లో గ్లామర్ ఒలకబోసేస్తోంది. ఇంతవరకూ గ్లామర్‌కి దూరంగా వున్న మహానటి.. బాలీవుడ్‌కి వెళ్లాకా గ్లామర్ కంచెలు తెంచేసిందంటూ నెటిజనం విస్తుపోతున్నారు.
‘సర్కారు వారి పాట’ సినిమా నుంచే కీర్తి సురేష్ గ్లామర్ తెరలకు బాగా పని చెప్పింది. ఇక, ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్లాకా.. బొత్తిగా తన సంస్కారం వదిలేసిందంటూ.. ఇంతవరకూ ఆమెను అమితంగా అభిమానించిన వాళ్లే దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు