దిల్ రాజు బ్యానర్‌లో డిఫరెంట్ జోనర్.!
- April 26, 2024
ఇంతవరకూ దిల్ రాజు బ్యానర్‌లో ట్రెడిషనల్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీసే రూపొందాయ్. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆహ్లాదంగా అలరించే సినిమాలే అవన్నీ.
అయితే, తాజాగా దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ‘లవ్ మీ’. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ సినిమాకి హారర్ టచ్ ఇచ్చారట. టైటిల్‌లో లవ్ వున్నప్పటికీ, ఇదో హారర్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది.
ఇంతవరకూ దిల్ రాజు టచ్ చేయని జోనర్ ఇది. అయితే, లార్జ్ స్కేల్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. ప్రముఖ వెటరన్ పీసీ శ్రీరామ్ దీనికి డీవోపీగా చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ‘బేబీ’ సినిమాతో వైష్ణవీ చైతన్య క్రేజ్ ఆకాశాన్నంటేసిన సంగతి తెలిసిందే. అందులోనూ హారర్ ధ్రిల్లర్ బేస్ మూవీస్‌కి ప్రస్తుతం క్యూరియాసిటీ ఎక్కువగా కనిపిస్తోంది.
సో, డిఫరెంట్ జోనర్ అయినా, రాజుగారు ఈ సినిమాతో సక్సెస్ కొడతారనే అనిపిస్తోంది చూడాలి మరి. మేలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?