హీట్ వల్ల కూడా హార్ట్ స్ర్టోక్ వస్తుందా.?
- April 26, 2024
ఎండలు మండిపోతున్నాయ్. రోజు రోజుకీ పెరిగిపోతున్నా ఉష్ణోగ్రతలతో హీట్ వీవ్ అలర్జ్ కూడా. ఎండలో తిరిగితే హీట్ స్ర్టోక్ వస్తుంది. అలాగే డీ హైడ్రేషన్ కూడా. డీహైడ్రేషన్ నుంచి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే రిలాక్స్ అవ్వొచ్చు.
కానీ, హీట్ స్ర్టోక్ ఒకింత ప్రమాదమే అంటున్నారు నిపుణులు. స్ర్టోక్ వచ్చిన వెంటనే అంతగా ప్రభావం చూపకపోయినా కొన్ని రోజుల తర్వాత దీర్ఘ కాలిక వ్యాధులకు దారి తీసే ప్రమాదం వున్నట్లు హెచ్చరిస్తున్నారు.
దాంతో పాటూ, గుండె పోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే అని తాజాగా ఓ సర్వేలో తేలిందట. హీట్ స్ర్టోక్‌కీ, గుండె పోటుకీ సంబంధం ఏంటీ.? అనుకుంటున్నారా.?
శరీంలో నీటి పరిమాణం తగ్గిపోవడం వల్ల అది గుండె పోటుకి దారి తీస్తుందట. 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో తిరిగితే హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందట. మరి అత్యవసర పరిస్థితి అయితే ఏం చేయాలి.?
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
తప్పకుండా రోజుకి ఎనిమిది నుంచి పది లీటర్ల నీరు తాగాలి. క్రమం తప్పకుండా ప్రతీరోజూ నిమ్మకాయ రసం తాగుతుండాలి.
కొంత టైమ్ గ్యాప్‌లో ఖచ్చితంగా ఏదో ఒక అల్పాహారం తీసుకుంటూ వుండాలి. టైట్‌గా వుండే హెవీ బట్టలు ధరించరాదు. లైట్‌గా వుండే కాటన్ బట్టలనే ధరించాలి.
అర్జెంటు పనులుంటే తప్ప ఎండలో తిరగకపోవడమే మంచిది. ఒకవేళ హీట్ స్ర్టోక్ తగిలి సమస్య తీవ్రతరం అనిపిస్తే.. ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?