హీట్ వల్ల కూడా హార్ట్ స్ర్టోక్ వస్తుందా.?
- April 26, 2024ఎండలు మండిపోతున్నాయ్. రోజు రోజుకీ పెరిగిపోతున్నా ఉష్ణోగ్రతలతో హీట్ వీవ్ అలర్జ్ కూడా. ఎండలో తిరిగితే హీట్ స్ర్టోక్ వస్తుంది. అలాగే డీ హైడ్రేషన్ కూడా. డీహైడ్రేషన్ నుంచి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే రిలాక్స్ అవ్వొచ్చు.
కానీ, హీట్ స్ర్టోక్ ఒకింత ప్రమాదమే అంటున్నారు నిపుణులు. స్ర్టోక్ వచ్చిన వెంటనే అంతగా ప్రభావం చూపకపోయినా కొన్ని రోజుల తర్వాత దీర్ఘ కాలిక వ్యాధులకు దారి తీసే ప్రమాదం వున్నట్లు హెచ్చరిస్తున్నారు.
దాంతో పాటూ, గుండె పోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే అని తాజాగా ఓ సర్వేలో తేలిందట. హీట్ స్ర్టోక్కీ, గుండె పోటుకీ సంబంధం ఏంటీ.? అనుకుంటున్నారా.?
శరీంలో నీటి పరిమాణం తగ్గిపోవడం వల్ల అది గుండె పోటుకి దారి తీస్తుందట. 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో తిరిగితే హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందట. మరి అత్యవసర పరిస్థితి అయితే ఏం చేయాలి.?
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
తప్పకుండా రోజుకి ఎనిమిది నుంచి పది లీటర్ల నీరు తాగాలి. క్రమం తప్పకుండా ప్రతీరోజూ నిమ్మకాయ రసం తాగుతుండాలి.
కొంత టైమ్ గ్యాప్‌లో ఖచ్చితంగా ఏదో ఒక అల్పాహారం తీసుకుంటూ వుండాలి. టైట్‌గా వుండే హెవీ బట్టలు ధరించరాదు. లైట్‌గా వుండే కాటన్ బట్టలనే ధరించాలి.
అర్జెంటు పనులుంటే తప్ప ఎండలో తిరగకపోవడమే మంచిది. ఒకవేళ హీట్ స్ర్టోక్ తగిలి సమస్య తీవ్రతరం అనిపిస్తే.. ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు