ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- April 27, 2024
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. ఐదు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను ఆయన గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని… వెంటనే వాటి నుంచి బయటపడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యక్తిగత జీవిత వివరాలు పంచుకున్నారు. డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లిన తాను అక్కడి నుంచి దూకి ఆత్మచేసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయతే తన పల్లల గురించి ఆలోచించి ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.
1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్‌గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్.. తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని వెల్లండించారు. ఆ సమయలో చాలా బాధలో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆ బాధలో తాగటం అలవాటు లేని తనకు మందు బాటిల్ తీసుకొని డెలావేర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి తాగుతుండగా.. ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్నారు. కానీ తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆలోచించి.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పుకొచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని బైడెన్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-బైడెన్ తలపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్లో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్‌తో డిబేట్ తనకు సంతోషమన్నారు. దీనిపై ట్రంప్ సైతం ప్రతిస్పందిస్తూ.. తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు అంగీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. ఇక అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు