‘జై హనుమాన్’.! ముందుగా అనుకున్నదానికంటే అంతకు మించి.!
- April 27, 2024
‘హనుమాన్’ సినిమా తర్వాత ప్రతీ రోజూ ప్రశాంత్ వర్మ వార్తల్లో నిలుస్తున్నాడు. సినీ ప్రియులకి కావల్సిన ఏదో ఒక కంటెంట్ ఇస్తూనే వస్తున్నాడు. తాజాగా ‘జై హనుమాన్’ సినిమాకి సంబంధించి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చాడు.
‘జై హనుమాన్’ సినిమాలో లీడ్ రోల్ హనుమంతుడి పాత్ర. ఆ పాత్రలో స్టార్ హీరో నటించబోతున్నాడు.. అనే క్లారిటీ ఇచ్చేశాడు. ఆ పాత్ర విషయంలో రోజుకో గాసిప్ చక్కర్లు కొడుతూనే వుంది. కానీ, ఆ గాసిప్స్ అన్నీ నిజమే అన్నాడంతే అసలు విషయం బయటపెట్టలేదు ప్రశాంత్ వర్మ.
ఇక, మిగిలిన పాత్రలన్నీ మొదటి పార్ట్లోనివే కంటిన్యూ అవుతాయని చెప్పాడు. కానీ, అంతకు మించి లార్జ్ స్కేల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాలో మరిన్ని ఇంపార్టెంట్ రోల్స్ యాడ్ అవుతాయట.
వాటి కోసం పలు భాషల నుంచి పలువురు స్టార్ నటీ నటుల్ని ప్రశాంత్ వర్మ దించబోతున్నాడట. ఆయా పాత్రల కోసం మళ్లీ తన స్ర్కిప్టులో చాలా చాలా మార్పులు చేస్తున్నాడట. అలా ‘జై హనుమాన్’ ముందుగా అనుకున్నదానికంటే చాలా చాలా పెద్ద సినిమా కానుందనీ తెలుస్తోంది.
ఇంత పెద్ద సినిమాని ఇన్ని భారీ అంచనాల నడుమ ప్రశాంత్ వర్మ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు