ఫరియా అబ్ధుల్లా.! కాబోయే భర్త విషయంలో ‘జాతి రత్నమే’.!
- April 27, 2024ప్రతీ ఆడపిల్లా తనకు కాబోయే భర్త ఇలా వుండాలి.. అలా వుండాలి.. అంటూ కలలు కనడం సహజమే. అయితే, ‘జాతి రత్నాలు’ భామ ఫరియా అబ్ఢుల్లా తనకు కాబోయే భర్త కోసం ఏం చెప్పిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇంతకీ ఫరియా అబ్ధుల్లా ఏం చెప్పిందట.! ఫరియా అబ్ధుల్లా హైట్ గురించి తెలిసిందే. దాదాపు ఆరడుగుల ఆజానుబాహురాలీ ముద్దుగుమ్మ. సో సహజంగా మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం అమ్మాయి హైట్ కన్నా ఒక ఇంచైనా హైటుండాలనుకుంటారు ఆమెకు కాబోయే భర్త (ఈ మధ్య ఆ రూల్సేం లేవనుకోండి).
ఆరడుగుల ఆజానుబాహులు దొరకడమే కష్టం అనుకుంటే.. అంతకు మించి హైట్.. అంటే కాస్త కష్టమే. అయితే, ఫరియా అబ్ధుల్లా మాత్రం హైట్ తనకు పెద్దగా ప్రాబ్లమ్ కాదంటోంది.
కానీ, తన జీవితంలో ఎప్పుడూ తనను నవ్వుతూ నవ్విస్తూ ఫన్‌గా చూసుకునేవాడే తనకు భర్తగా కావాలంటోంది. అమ్మడు ప్రస్తుతం ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కంప్లీట్ ఫన్ టోన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియా ఈ వ్యాఖ్యలు చేసింది. సో, ఇది కూడా తన సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిన డిఫరెంట్ పబ్లిసిటీ స్టంటే అనుకోవాలా.? లేదంటే నిజంగానే ఫరియా అలా కోరుకుంటోందా.? లెట్స్ వెయిట్.!
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు