‘మా ఇంటి బంగారం’ సమంత.! ఇంటెన్స్ అదిరిందిగా.!
- April 29, 2024
సమంత పనైపోయిందనుకున్నారంతా. కానీ, సమంత మళ్లీ వస్తోంది. ‘మయోసైటిస్’ అనే వ్యాధి కారణంగా సమంత ఇకపై సినిమాల్లో నటించేది లేదు.. అని ఫిక్స్ అయిపోయారు సినీ జనం.
అయినా ఆ తర్వాత ‘యశోద’ ‘శాకుంతలం’ అనే సినిమాలొచ్చాయ్ ఈ న్యూస్ బయటికొచ్చాకా. ఈ సినిమాలను మార్కెట్ చేసుకునేందుకు సమంత సింపథీ క్రియేట్ చేసిందన్న రూమర్లు కూడా లేకపోలేదు ఆ టైమ్‌లో.
అయితే, ఆ తర్వాత ‘ఖుషి’ సినిమాలోనూ సమంత నటించింది. ఇక, ఇప్పుడయితే సమంత ఖాళీగానే వుందనుకునేరు. కానీ సమంత ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది.
అదే ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లయిన యువతి పాత్రలో సమంత కనిపిస్తోంది. కానీ, చాలా వైల్డ్ లుక్స్‌లో. కిచెన్‌లో ఒంటి మీద రక్తపు మరకలతో చేతిలో గన్‌తో సమంత కనిపిస్తున్న లుక్ అది.
ఓ పక్క స్టవ్‌పై కుక్కర్ విజిల్, మరోవైపు ఓ క్యూట్ టెడ్డీ బేర్.. చాలా సీరియస్‌గా చేతిలో గన్ను పట్టుకుని ఎవరికో గట్టిగా గురి పెడుతున్న సమంత లుక్ చాలా ఇంటెన్సింగ్‌గా వుంది. అన్నట్లు ఈ సినిమాని సమంతే స్వయంగా నిర్మిస్తోంది కూడా. ఈ లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.!
తాజా వార్తలు
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







