‘తండేల్’ డిజిటల్ రైట్స్ వామ్మో.! అంత రేటు పలికిందా.?

- April 29, 2024 , by Maagulf
‘తండేల్’ డిజిటల్ రైట్స్ వామ్మో.! అంత రేటు పలికిందా.?

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా వస్తున్న సినిమా ‘తండేల్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కథ, కథనాలు ఖచ్చితంగా నెక్స్‌ట్ లెవల్‌లో వుంటాయని అంచనా వేస్తున్నారు.

దర్శకుడు చందూ మొండేటిపై నమ్మకం, నాగ చైతన్య ఇంటెన్స్ లుక్స్.. అన్నింటికీ మించి సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుందన్న పేరు.. ఇలా చెప్పుకూంటూ పోతే ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ చాలానే వున్నాయ్.

అంతేకాదు, ఈ సినిమాని ఎంతో నమ్మకంగా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచే దిశగానే నడిపిస్తున్నాయ్.

డిశంబర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక, తాజాగా సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లే వార్త ఇండస్ర్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లక్స్ దక్కించుకుందట. అంతేకాదు, ఏకంగా 40 కోట్లు పైనే రేటుతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకుందట. దాంతో, సినిమా అవుట్ పుట్‌పై మరింత నమ్మకం కుదిరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com