‘కల్కి’ ఈ సారైనా నిజమేనా.?

- April 29, 2024 , by Maagulf
‘కల్కి’ ఈ సారైనా నిజమేనా.?

ప్రబాస్ సినిమాలేమీ అనుకున్న టైమ్‌కి రిలీజ్ కావు.. అన్న మార్క్ అయితే పడిపోయింది. కానీ, ‘కల్కి’ సినిమాని అనుకున్న టైమ్‌కి ఎలాగైనా రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్లు.

అన్నీ అనుకున్నట్లయితే ‘కల్కి’ మే 9న రిలీజ్ కావల్సి వుంది. అంటే, ఈ పాటికే ‘కల్కి’ హంగామా మొదలైపోయి వుండేది. కానీ, ఎప్పటిలాగే ఈ సినిమా వాయిదా పడింది. జూన్‌లోనా.? జూలైలోనా.? అని మల్లగుల్లాలు పడుతూ ఫైనల్‌గా జూన్ 27కి కొత్త రిలీజ్ డేట్ సెట్ చేసుకుంది.

అయితే, ఈ డేట్‌కైనా వచ్చే అవకాశముందా.? అంటే ఏమో నమ్మకం లేదనే చెబుతున్నారు. ఓ వైపు దర్శకుడు నాగ్ అశ్విన్, మరోవైపు నిర్మాత అశ్వనీ దత్ శత విధాలా కృషి చేస్తున్నారు.

కానీ, ఈ సినిమా స్కేల్ సంగతి తెలిసిందే. చాలా లార్జ్ స్కేల్ మూవీ. అంతేకాదు, ‘సలార్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా ఆ రేంజ్‌లోనే వుంటాయ్.

ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లోనే నిర్మాత అశ్వనీ దత్ చెప్పేశారు. ‘కల్కి’ని ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ మూవీగా సిద్ధం చేస్తున్నామని. సో, ఏ రేంజ్‌లో అంచనాలుంటాయ్ ఈ సినిమాపై. సో, రిలీజ్‌కి ముందే అన్నీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అందుకే రిలీజ్ విషయంలో ఈ తికమక.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com