‘ఆ ఒక్కటీ అడక్కు’.! అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.?
- April 29, 2024
ఒకప్పుడు అల్లరి నరేష్ అంటే మినిమమ్ గ్యారంటీ హీరో. ఈయన సినిమాలకు వెళితే ఖచ్చితంగా వినోదం పైసా వసూల్ అనే నమ్మకం వుండేది. కానీ, మధ్యలో మూస కథలతో బోర్ కొట్టించేస్తున్నాడన్న ముద్ర వేయించుకుని రేస్ నుంచి పక్కకు తప్పుకున్నాడు అల్లరి నరేష్.
తన స్ర్టెంత్ అయిన కామెడీని పక్కన పెట్టేసి ‘నాంది’ తదితర డిపరెంట్ సీరియస్ మూవీస్ కూడా చేశాడు. అలాగే, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించాడు.
కానీ, ఇప్పుడు ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో వస్తున్నాడు. అప్పట్లో రాజేంద్రప్రసాద్, రంభ జంటగా ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అదే టైటిల్‌తో తన మార్కు కామెడీతో అల్లరి చేసేందుకు వస్తున్నాడు అల్లరి నరేష్. ఫరియా అబ్ధుల్లా హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ప్రచారం చిత్రాలు ఇంట్రెస్టింగ్‌గానే వున్నాయ్. పాజిటివ్ నోట్సే వినిపిస్తున్నాయ్ సినిమా మీద. అన్నింటికీ మించి మంచి వినోదాత్మక సినిమాలు ఈ మధ్య కరువయ్యాయ్. ఈ నేపథ్యంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఆకట్టుకుంటే, ఖచ్చితంగా అల్లరోడు ఈజ్ బ్యాక్.!
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







