జాతిరత్నాలు 2’ లేటెస్ట్ అప్‌డేట్.!
- April 30, 2024
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే సినిమాతో ఫేమ్ సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత ‘జాతి రత్నాలు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి యూత్‌లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నాడీ యంగ్ స్టర్.
స్వీటీ అనుష్కతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటించి మెప్పించాడు. నవీన్ నటించిన ‘జాతి రత్నాలు’ సినిమాకి సీక్వెల్ వుండనుందని అప్పట్లోనే మేకర్లు తెలిపారు.
మరి, ఇంతవరకూ సీక్వెల్ ముచ్చట లేదేం.. అని ఈ మధ్య ఓ ప్రస్థావన రాగా.. అందుకు క్లారిటీ వచ్చింది హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా నుంచి. చిట్టి పాత్రలో నటించి ఈ సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించింది ఫరియా అబ్ధుల్లా.
ప్రస్తుతం ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మే తన నోటితో స్వయంగా ‘జాతా రత్నాలు 2’ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్‌లో ‘కల్కి’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ కాగానే ‘జాతి రత్నాలు 2’ సినిమా పట్టాలెక్కుతుందని చిట్టి పాప ఫరియా అబ్ధుల్లా వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్‌లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







