స్పీడు పెంచిన నాగ చైతన్య.!
- April 30, 2024
‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కార్తీక్ దండు. ఈ డైరెక్టర్ అక్కినేని హీరో నాగచైతన్యతో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
డిశంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఈ లోపే కార్తీక్ దండు సినిమాని పట్టాలెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది. రేపో మాపో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట.
ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అలాగే, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోందట.
కాగా, ఈ సినిమా కథ, కాన్సెప్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో మిళితమైన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందబోతోందట.
ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమాలోని సన్నివేశాలు వుండబోతున్నాయట. గతంలో ‘ధూత’ అనే వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ని టచ్ చేశాడు. విజయం సాధించాడు.
ఇప్పుడు మళ్లీ అదే టైప్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. కార్తీక్ చెప్పిన కథ చాలా బాగుందట. ఆల్రెడీ ‘విరూపాక్ష’ సినిమాతో ఈ డైరెక్టర్ మంచి మార్కులేయించుకున్నాడు. సో, అదే తరహా కాన్సెప్ట్ అయితే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలిసినోడే కాబట్టి.. నాగ చైతన్యకు కార్తీక్ దండు రూపంలో ఓ హిట్ రెడీగా వుందనే అనుకోవచ్చేమో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







