‘కృష్ణమ్మ’ ట్రైలర్ వచ్చేసింది..
- May 02, 2024
హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి ప్రస్తుతం విలన్‌గా, హీరోగా వరుస సినిమాలను చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆయన నటిస్తున్న చిత్రం కృష్ణమ్మ. అథిరా రాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకుడు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తుండగా, అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ కేసులో సత్యదేవ్‌ను ఇరికించినట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. దాన్ని నుంచి అతడు ఎలా బయటపడ్డాడు. అసలు ఆ కేసు ఏంటి ? అతడినే ఎందుకు ఇరికించారు అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
“కథ నడకకైనా, నది నడకకైనా మలుపులే అందం. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటామ్.”.. ‘ఇన్నాళ్లు ఎప్పుడు పుట్టాము, ఎవరికి పుట్టామో తెలియక పోవడమే బాధ అని అనుకున్నాను.. కానీ..ఎందుకు చనిపోతున్నామో, ఎవడి చేతుల్లో చనిపోతున్నామో అసలైన భాద’ అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







