‘కృష్ణ‌మ్మ’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

- May 02, 2024 , by Maagulf
‘కృష్ణ‌మ్మ’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

హైదరాబాద్: జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి ప్ర‌స్తుతం విల‌న్‌గా, హీరోగా వ‌రుస సినిమాల‌ను చేస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు స‌త్య‌దేవ్‌. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం కృష్ణమ్మ. అథిరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ ద‌ర్శ‌కుడు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తుండగా, అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మే 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఓ కేసులో స‌త్య‌దేవ్‌ను ఇరికించిన‌ట్లుగా ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. దాన్ని నుంచి అత‌డు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. అస‌లు ఆ కేసు ఏంటి ? అత‌డినే ఎందుకు ఇరికించారు అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

“క‌థ న‌డ‌క‌కైనా, న‌ది న‌డ‌క‌కైనా మ‌లుపులే అందం. కానీ కొన్ని మ‌లుపుల్లో సుడులు ఉంటామ్‌.”.. ‘ఇన్నాళ్లు ఎప్పుడు పుట్టాము, ఎవ‌రికి పుట్టామో తెలియ‌క పోవ‌డ‌మే బాధ అని అనుకున్నాను.. కానీ..ఎందుకు చ‌నిపోతున్నామో, ఎవ‌డి చేతుల్లో చ‌నిపోతున్నామో అస‌లైన భాద’ అంటూ స‌త్య‌దేవ్ చెప్పిన డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com