రమదాన్ తొలిరోజు: 5 గంటలు 250 ప్రమాదాలు
- June 08, 2016
పవిత్ర రమదాన్ మాసంలో తొలి రోజున కేవలం 5 గంటల్లోనే మొత్తం 250 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని దుబాయ్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ దుబాయ్ పోలీస్, తొలి రోజు 2419 ఫోన్ కాల్స్‌ని అందుకుంది. 250 ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి తెలియజేశారు. డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ కజ్రాజ్ మజీద్ అల్ కజ్రాజి ఈ విషయాల్ని వెల్లడించారు. ఇతర వాహనాలతో తగినంత దూరం రోడ్లపై పాటించాల్సిందిగా వాహనదారులకు విజ్ఞప్తి చేసిన కజ్రాజ్ మజీజ్, వేగ నియంత్రణపై శ్రద్ధ అవసరమని సూచించారు. అలాగే, చిన్న చిన్న విషయాల కోసం ఎమర్జన్సీ ఫోన్‌కాల్ డిపార్ట్‌మెంట్‌ని ఇబ్బంది పెట్టవద్దనీ, తద్వారా ఎమర్జన్సీ సర్వీసులకు ఆటంకం కలుగుతుందన్నారు. రస్ అల్ ఖైమాలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా, ప్రమాదానికి గురై చనిపోయిందని పోలీసులు తెలిపారు. రోడ్లు దాటేటప్పుడు పాదచారులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







