శ్రీలీల జాగ్రత్త పడిందా.?

- May 02, 2024 , by Maagulf
శ్రీలీల జాగ్రత్త పడిందా.?

‘ధమాకా’ సినిమా హిట్ అవ్వడంతో ఏకంగా స్టార్ హీరోలతో వరుస ఆఫర్లు కొల్లగొట్టేసి స్టార్ హీరోయిన్ ఛెయిర్‌ని సింపుల్‌గా వేగంగా ఎక్కేసింది అందాల భామ శ్రీలీల. అయితే, వస్తున్నాయ్ కదా.. క్రేజ్ వుంది కదా.. అని దొరికిన ప్రథీ ఛాన్స్ అంది పుచ్చేసుకోవడంతో శ్రీలీల బొక్క బోర్లా పడింది.

ఎంత ఫాస్ట్‌గా పేరు తెచ్చుకుందో అంతే ఫాస్ట్‌గా నెగిటివిటీనీ మూట కట్టసుకుంది. అమ్మడి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు కాస్త స్లో అయ్యింది.

ఇంతవరకూ ఒప్పుకున్న ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రమే వుంది. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి వుంది కానీ, ఆ సినిమా విషయంలో తెర వెనుక చర్చలు ఇంకా ఫైనల్ కాలేదు.

దాంతో, శ్రీలీల కాస్త వెనుకడుగు వేసిందట. ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటోందట. ఈ సారి మంచి పర్‌ఫామెన్స వున్న ఛాలెంజింగ్ రోల్ అయితేనే సైన్ చేయాలని అనుకుంటోందట. మార్పు మంచిదే. మంచి పర్‌ఫామెన్స్ పడాలంటే కాస్త ఆచి తూచి అడుగులు వేయాల్సిందే. అన్నట్లు  కోలీవుడ్ నుంచీ  శ్రీలీలకు ఓ ఛాన్స్ వచ్చిందని సమాచారం. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com