రైట్ టైమ్‌లో ‘హరి హర వీరమల్లు’ టీజర్.!

- May 02, 2024 , by Maagulf
రైట్ టైమ్‌లో ‘హరి హర వీరమల్లు’ టీజర్.!

ఓ పక్క సమ్మర్ హీట్, మరోపక్క ఎలక్షన్స్ హీట్. ఈ టైమ్‌లో పవన్ కళ్యాణ్ నుంచి ఓ హాట్ అప్టేట్. అదే ‘హరి హరవీరమల్లు’ టీజర్. గతంలో గ్లింప్స్ రిలీజ్ చేశారు. యోధుడిలా పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాట ఘట్టాన్ని శాంపిల్‌గా ఆ గ్లింప్స్‌లో చూపించారు.

ఇప్పుడు అంతకు మించి అనేలా పవన్ కళ్యాణ్ పాత్రను ఎలివేట్ చేశారు. దొరలు పేదోళ్లని దోచుకుంటే, ఆ దొరల్ని నవాబులు దోచుకుంటారు. ఆ నవాబుల్ని ఢిల్లీలో వుండే చక్రవర్తులు దోచుకుంటారు.. అయితే, ఈ దొంగ నవాబుల బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి భగవంతుడు ఒకడ్ని పంపిస్తాడు.. అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో పవర్ ఫుల్ వాయిస్‌తో స్టార్ట్ అయిన టీజర్.

అప్పుడే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ. బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్. జస్ట్ టీజర్‌లోనే ఇంత చూపించారు. ఇక ట్రైలర్.. సినిమా ఎలా వుండబోతుందో.. అంటూ ఆసక్తి అమాంతం పెరిగిపోయింది.

ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తిగా బాబీ డియోల్ క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు సరిసాటి అయిన వీరుడిగా పవన్ కళ్యాణ్ పాత్ర వుడబోతోంది.

ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఎ.ఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకోగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ వుండబోతోందని టీజర్ ద్వారా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com