అరటి పండు తింటే బీపీ కంట్రోల్లో వుంటుందా.?
- May 02, 2024
పండ్లలో రారాజుగా పేర్కొంటాం అరటి పండుని. సీజన్లతో పని లేకుండా, అన్ని వర్గాల వారికీ ఎప్పుడూ అందుబాటులో వుండే ఫలం అరటి పండు. తక్కువ ఖర్చుతో విరివిగా లభించే ఈ అరటి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్ పుష్కలంగా వుండడంతో పాటూ, కార్భో హైడ్రేట్లూ, విటమిన్లు కూడా అధికంగా వుంటాయ్.
పాస్ఫరస్ అధికంగా వుండడం వల్ల అధిక రక్తపోటు సమస్య వుండదు. తద్వారా బీపీ కంట్రోల్లో వుంటుంది. గుండె జబ్బులు దరి చేరవు.
అంతేకాదు, విటమిన్ ఏ, బీ 6 అరటి పండులో ఎక్కువగా వుండడం వల్ల చర్మ సౌందర్యం కూడా వృద్ధి చెందుతుంది. దీనిలోని ఫైబర్ మలబద్ధకం సమస్యను తీరుస్తుంది.
అరటి పండులోని కేలరీలు అధికంగా వుండడం వల్ల ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు అరటి పండును క్రమం తప్పకుండా తినొచ్చు.
రాత్రి పూట అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తాయని కొందరిలో అపోహలున్నాయ్. కానీ, అవి కేవలం అపోహలు మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదండోయ్ మానసిక స్థితి సరిగ్గా లేని వారికి అరటి పండు ఓ దివ్యౌషధంగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు