విజయ్ దేవరకొండ.! ఫ్యామిలీ స్టార్ నుంచి ర‌డీ ఇమేజ్‌కి.!

- May 04, 2024 , by Maagulf
విజయ్ దేవరకొండ.! ఫ్యామిలీ స్టార్ నుంచి ర‌డీ ఇమేజ్‌కి.!

‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ఇటీవల ప్రేక్షకుల్ని మెప్పించిన విజయ్ దేవరకొండ కొత్త కాన్సెప్ట్‌కి ఓకే చెప్పాడు. కోలా రవి కిరణ్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు నచ్చడంతో ఆ కథకు వెంటనే ఓకే చేశాడు. ప్రస్తుతం నక్కిన త్రినాధ రావుతో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా విజయ్ లైన్‌లో పెట్టి వుంచాడు. తాజాగా రవి కిరణ్ దర్శకత్వంలో ఓ సినిమాని అధికారికంగా ప్రకటించాడు.

ఈ సినిమాని దిల్ రాజు తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ‘రౌడీ జనార్ధన్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు ఈ సినిమా కోసం. అలాగే పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు మే 9న తర్వాత వెల్లడి చేయనున్నారట.

గతంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘నోటా’ అనే సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. కెరీర్ తొలి నాళ్లలో నటించిన చిత్రమిది. అయితే, అప్పట్లో  ఆ సినిమా జనానికి అంతగా ఎక్కలేదు. మరి, రాబోయే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఎలా మెప్సిస్తుందో.. విజయ్ కెరీర్‌కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com