నెలసరిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ సహజమే కానీ జాగ్రత్త
- July 01, 2015
సాధారణంగా టేనేజ్లో హార్మోన్స్ సమతుల్యత, అసమతుల్యతల కారణంగా, తమ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి టీనేజ్ అమ్మాయిల్లో. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది నెలసరి సమస్య. ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వికారం, అధిక రక్తస్రావం లాంటి సమస్యలను అధిగమించాలంటే కేవలం కొద్డిగా ప్రాధమిక అవగాహన, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా నెలసరి సమయంలో వచ్చే నొప్పికి కారణం. అండం విడుదలయ్యేటప్పుడు అక్కడి కండరాలు సంకోచ, వ్యాకోచాల వల్ల ఈ నొప్పి కలుగుతుంది. ఈ సమయంలో సాధారణంగా తీసుకునే జాగ్రత్తలను పాఠిస్తే సరిపోతుంది. నూలు లోదుస్తులు ధరించడం, పరిశుభ్రమైన న్యాప్కీన్లు వాడడంలాంటివి చేయాలి. ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే జననేంద్రియాల దురద, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యకు అధిక బరువు కూడా ఒక కారణం కావచ్చు. ఈ అధిక బరువు వల్ల జననేంద్రియాల వద్ద రాపిడి జరిగి పుండు పడే అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడు ఆందోళన చెందకుండా వైద్యుని సంప్రదించడం వల్ల కొన్ని న్యాపీ క్రీంలు, పౌడర్లులాంటివి సూచిస్తారు. వాటిని వాడడం వల్ల అసౌకర్యం తగ్గడమే కాకుండా రాపిడిని కూడా నియంత్రించుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







