తమన్నా గుర్రపుస్వారీ ..

- June 08, 2016 , by Maagulf
తమన్నా గుర్రపుస్వారీ ..

పచ్చబొట్టేసినా పిల్లగాడా నీతో.. అంటూ 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రంలో అవంతిక పాత్రలో కుర్రకారును మురిపించిన కథానాయకి తమన్నా. ప్రస్తుతం ఈ మిల్కీబ్యూటీ ఆ సినిమాకి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రం కోసం తమన్నా గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నారట. ఈ విషయాన్ని తమ్ము తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... గుర్రంతో దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'నా కొత్త స్నేహితురాలు పూజ. బాహుబలి చిత్రం కోసం గుర్రపుస్వారీ పాఠాలు. ఆమె(గుర్రం) అందంగా ఉంది' అని ట్వీట్‌ చేశారు.'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం గత ఏడాది జులై 10న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com