25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు..

- June 08, 2016 , by Maagulf
25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు..

 ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. 'జననీ సేవ'గా నామకరణం చేసిన ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా 25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందుబాటులో ఉంచారు. దీంతో పాటు 5-12 ఏళ్ల వయసున్న చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూ రూపొందించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభు మాట్లాడుతూ... శిశువుకు పాలు దొరకడం లేదని ఓ బాలింత తనకు ట్వీట్‌ చేసిందని... దీంతో తాను స్పందించి శిశువుకు వెంటనే పాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇలాంటి పరిస్థితులు చాలామంది తల్లులు ఎదుర్కొంటున్నారని... అందువల్ల వారందరికీ ప్రయోజనకారిగా ఉండేందుకే 'జననీ సేవ'ను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com