మోసగాళ్ళ వలలో పడొద్దు: పౌరులకు ఇండియన్‌ ఎంబసీ సూచన

- June 08, 2016 , by Maagulf
మోసగాళ్ళ వలలో పడొద్దు: పౌరులకు ఇండియన్‌ ఎంబసీ సూచన


ఎంబసీ అధికారుల పేరుతో ఎవరైనా మస్కట్‌లోని పౌరులకు ఫోన్‌ చేసి, డబ్బులు చెల్లించాలనీ, జరీమానా పెండింగ్‌లో ఉందనీ, తప్పుడు ధృవపత్రాలు కలిగి ఉన్నారనీ బెదిరిస్తే తక్షణం ఆ సమాచారాన్ని తమకు తెలియజేయాల్సిందిగా ఇండియన్‌ ఎంబసీ అధికారులు మస్కట్‌లోని భారతీయులకు సూచించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నట్లుగా తమకు సమాచారం అందుతోందని ఎంబసీ అధికారులు తెలిపారు. ఎంబసీ నుంచి ఎవరూ అలాంటి ఫోన్‌ కాల్స్‌ చెయ్యరనీ, భారతీయులెవరికైనా అలాంటి కాల్స్‌ వస్తే, వెంటనే ఆ వివరాల్ని 24684517 లేదా ఇండియన్‌ ఎంబసీకి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎంబసీ సూచిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com