లిచి పండుని ఆరోగ్యానికి మంచిదేనా.?
- May 06, 2024
కొన్ని రకాల పండ్లు సీజనల్‌గా వస్తుంటాయ్. ఆయా సీజన్లలో వచ్చే పండ్లను తప్పక తింటుండాలి. కానీ, సీజనలే అయినా కొన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ కొన్ని రకాల దీర్ఘ కాలిక వ్యాధులున్న వాళ్లు తీసుకోరాదని చెబుతుంటారు. అలాంటి వాటిలో ఒకటి లిచి పండు.
రెడ్ కలర్లో చూడగానే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ తినేయాలనిపించే లిచి పండు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే, ఈ పండు తినడం వల్ల ఆరోగ్యమే కాదు, కొన్ని సార్లు అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది కూడా.
ముఖ్యంగా స్కిన్ అలర్జీలు కానీ, డస్ట్ అలర్జీ వంటి ఏ ఇతర అలెర్జీ సమస్యలున్నవారైనా సరే, ఈ పండు జోలికి పోకుండా వుంటే మంచిదని అంటున్నారు.
అలాగే హై బీపీ సమస్య వున్నవాళ్లు కూడా లిచి పండుకు దూరంగా వుండాలి. ఈ పండు తినడం వల్ల బీపీ లెవల్స్ పెరిగి స్ట్రోక్ వచ్చే ప్రమాదముందట.
బీపీతో పాటూ, ఇతర గుండె సంబంధిత వ్యాధులున్న వారు లిచి పండును తినకుండా వుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలోనే ఈ పండు అధికంగా లభిస్తుంటుంది.
అలాగే ఎండాకాలంలోనే పుష్కలంగా లభించే మామిడి పండ్లను సైతం మితి మీరి తినరాదని తాజా సర్వేలు చెబుతున్నాయ్.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..