ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- May 06, 2024
సౌదీ అరేబియా: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా సంచలనం సృష్టించింది. సౌదీ స్మాష్-2024 టీటీ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఒలింపిక్ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)కు మనిక బాత్రా షాకిచ్చింది. సోమవారం ఇక్కడ జరిగిన రౌండ్-32లో ప్రపంచ 39వ ర్యాంకర్ బాత్రా 3-1 (6-11, 11-5, 11-7, 12-10) తేడాతో చైనా స్టార్ వాంగ్‌పై సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో దూసుకెళ్లింది.
తొలి గేమ్‌ను కోల్పోయిన మనిక తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుస విజయాలతో 37 నిమిషాల్లోనే చైనా ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇక తర్వాతి మ్యాచ్‌లో బాత్రా జర్మనీకు చెందిన నినా మిత్తెల్హామ్తో ఢీ కొననుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో హర్మిత్ దేశాయ్-యశస్విని జంట క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్‌లో హర్మిత్-యశస్విని జోడీ 3-2 (11-5, 5-11, 3-11, 11-7, 11-7) తేడాతో ఐదో సీడ్ స్పానిష్ జంట అల్వారొ రొబ్లెస్-మారియా జియావ్లను ఓడించి టోర్నీలో ముందంజ వేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..