యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- May 07, 2024
యూఏఈః ICSE (ఇండియన్ సెకండరీ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) మరియు ISC ((ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు సోమవారం ప్రకటించారు. విద్యాసంస్థలు అద్భుతమైన ఉత్తీర్ణత రేటును నమోదు చేస్తున్నందున యూఏఈలోని అన్ని CISCE-అనుబంధ పాఠశాలల్లో ఉత్సాహం చోటుచేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాము మంచి ఫలితాలను చేసినట్లు తెలిపారు. త్వరలోనే తుది వివరాలను పంచుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ సంవత్సరం CISCE బోర్డు పరీక్షలు వివాదాలతో ప్రారంభం అయ్యాయి. కౌన్సిల్ రెండు పేపర్లను వాయిదా వేసింది. నిజానికి ఫిబ్రవరి 26న జరగాల్సి ఉంది. ISC కెమిస్ట్రీ పేపర్ మార్చి 21కి రీషెడ్యూల్ చేసారు. దీని తర్వాత, 12వ తరగతి సైకాలజీ పరీక్ష కూడా ఒక పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రం ప్యాకెట్ కనిపించకుండా పోవడంతో ఆలస్యమైంది. మొదట మార్చి 27న జరగాల్సిన పరీక్ష ఏప్రిల్ 4న జరిగింది. ఈ సెషన్ నుండి 10 మరియు 12 తరగతులకు కంపార్ట్మెంట్ పరీక్షలను నిలిపివేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అదే పరీక్ష సంవత్సరంలో తమ మార్కులు లేదా గ్రేడ్లను పెంచుకోవాలనుకునే విద్యార్థులు గరిష్టంగా రెండు సబ్జెక్టులలో ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ఎంచుకోవచ్చు. ఈ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు జూలైలో జరుగుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..