మెనా ప్రొఫెషనల్స్‌కి రమదాన్ పండగే పండగ
- June 08, 2016
మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికా ప్రొఫెషనల్స్‌లో 86.8 శాతం, ఏడాదిలో రమదాన్ తమకు వెరీ వెరీ స్పెషల్ ఈవెంట్ అని చెప్పారు. 'రమదాన్ ఇన్ మిడిల్ ఈస్ట్ వర్క్‌ప్లేస్' పేరుతో నిర్వహించిన సర్వేలో 3,660 మంది పాల్గొన్నారు. ఇందులో 53.7 శాతం మంది రమదాన్ సీజన్లో సహచరులను అర్థం చేసుకోవడానికి వారితో క్లోజ్‌గా మూవ్ అవడానికి అవకాశం దొరుకుతుందని చెప్పారు. 56.3 శాతం మంది తమ సంస్థ ఛారిటీ కార్యక్రమాల్ని చేపట్టడానికి తద్వారా తమలో ఛారిటీ భావం పెంపొందించడానికి రమదాన్ ఉపయోగపడ్తుందని అన్నారు. 96.1 శాతం మంది రమదాన్ తమ జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు తెస్తున్నాయని తెలిపారు. మెనా ప్రొఫెషనల్స్‌లో 83.1 శాతం మంది తమ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కొత్తగా రమదాన్ సీజన్లో మారుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన, భక్తి భావంతో కూడిన జీవనాన్ని రమదాన్ సీజన్లో పొందుతామని చాలామంది చెప్పారు. మే 17 మరియు 29 మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఒమన్, యూఏఈ, బహ్రెయిన్ అల్జీరియా, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, లిబియా, మొరాకో, ట్యునీషియా, ఖతార్, సౌదీ అరేబియా మరియు యెమెన్‌లో ఈ సర్వే నిర్వహించారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







