నిఖిల్ సినిమాలో అంత భారీ బడ్జెట్ యాక్షన్ ఎపిసోడా.?
- May 07, 2024
‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ సిద్దార్ధ్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దాంతో, నిఖిల్ ఇమేజ్ ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకుంది కూడా.
ఇక తాజాగా నిఖిల్ ‘స్వయంభు’ అనే పీరియాడికల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే, నభా నటేష్ వారియర్ క్వీన్‌గా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది కూడా. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ ఇండస్ర్టీలో చక్కర్లు కొడుతోంది.
భారీ స్కేల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. తాజా షెడ్యూల్లో భాగంగా ఓ బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారట. అందుకోసం దాదాపు 70 కోట్లు వ్యత్యించి రెండు భారీ సెట్లు డిజైన్ చేశారట.
దాదాపు 1000 మంది ఆర్టిస్టులతో ఈ భారీ వార్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారట. ప్రపంచ స్థాయి గొప్ప టెక్నీషియన్స్ ఈ యాక్షన్ ఘట్టానికి దృశ్య రూపం ఇచ్చేందుకు కష్టపడుతున్నారట.
సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ న భూతో న భవిష్యతి అనే స్థాయిలో వుండబోతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









