175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- May 10, 2024
న్యూయార్క్: మెట్లా ఫ్యాషన్ షో లో 175 కోట్ల విలువ చేసే వజ్రాల నెక్లస్ మెరుపులు మెరిసింది.ఈ నెక్లెస్ మన తెలంగాణ, హైదరాబాద్ క్వీన్ వేసుకోవడం మరో స్పెషల్. సుధారెడ్డి.. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) అధినేత కృష్ణారెడ్డి సతీమణి. విజయవాడకు చెందిన సుధ 19 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఆమె ధరించిన విలువైన వజ్రాల నెక్లెస్ టాక్ ఆఫ్ న్యూయార్క్ గా మారిపోయింది. ఆ నగలో 180 క్యారెట్ల వజ్రాలు పొదిగారు. ఇందులో ఒకటి 25 క్యారెట్ల హృదయాకారపు వజ్రం కాగా, మరో మూడు 20 క్యారెట్ల హృ దయాకారపువి. ఈ మూడూ తన భర్త, ఇద్దరు పిల్లలను ప్రతిబింబిస్తాయని అమె తెలిపింది. ఈ నెక్లెస్ పేరు 'అమోర్ ఎటెర్నో' (ఇటాలియన్ లో అంతులేని ప్రేమ). ఆమె ధరించిన గౌను సెలిబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహ్లియానీ డిజైన్ చేశారు. 80 మంది కళాకారులు దాదాపు 4 గంటలు కష్టపడి చేత్తో తయారు చేశారు. న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ నిధుల సేకరణ కోసం ప్రతి ఏడాది మే నెలలో ఈ ఈవెంట్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!