ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- May 11, 2024
హైదరాబాద్: ఈ నెల 13 న ఏపీలో అసెంబ్లీ ,లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున ఆంధ్ర ఓటర్లు తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్తుండడంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా ఓటేయడానికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు క్యూకట్టాయి. పెద్ద ఎత్తున వాహనాలు తరలివస్తుండటంతో భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ చెల్లింపునకు వాహనాలు బారులు తీరడంతో పంతంగి నుంచి చౌటుప్పల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుకుండటంతో హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. శుక్రవారం రాత్రి నుంచే విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!